Salaar - Prabhas: 'సలార్ 2' షూటింగ్ పై ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్‌డేట్.. ?

Prabhas - Salaar: ప్రభాస్.. గతేడాది చివర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన 'సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్' మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు బాహుబలి తర్వాత సరైన సక్సెస్‌లేని ప్రభాస్‌కు మంచి ఊపునిచ్చింది. సలార్ ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో రెండో పార్ట్ పై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పై ఓ వార్త్ చక్కర్లు కొడుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 1, 2024, 11:59 AM IST
Salaar - Prabhas: 'సలార్ 2' షూటింగ్ పై ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్‌డేట్.. ?

Prabhas - Salaar: రీసెంట్‌గా 'సలార్' మూవీతో పలకరించిన ప్రభాస్.. త్వరలోనే 'కల్కి 2898AD' మూవీతో పాటు 'ది రాజా సాబ్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక 'కల్కి 2898 AD' మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ప్రభాస్.. 'ది రాజా సాబ్' మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాలతో పాటు ఈ నెల చివర్లో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో 'సలార్  పార్ట్ 2 శౌర్యంగ పర్వం' మూవీ షూటింగ్ ఈ నెలాఖరులో మొదలు పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే సలార్ పార్ట్ 2కు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ ఎపుడో పూర్తైయింది. 'సలార్ పార్ట్ 1 హిట్ నేపథ్యంలో సలార్ పార్ట్ 2లో  కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. అంతేకాదు ఈ యేడాది డిసెంబర్ వరకు ఈ సినిమాతో పాటు 'ది రాజా సాబ్', సందీప్ రెడ్డి వంగాలతో పాటు హను రాఘవపూడి సినిమాలను ఏకకాలంలో చేస్తున్నాడు ప్రభాస్. నెలకు 10 నుంచి 15 రోజుల పాటు ఈ సినిమాకు డేట్స్ కేటాయించినట్టు సమాచారం.

అంతేకాదు 'సలార్ పార్ట్ 2'ను వచ్చే యేడాది దసరా వీలుకాకపోతే డిసెంబర్ నెలాఖరులో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా తెలుగు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాను ఇతర విదేశీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మించారు. సలార్ పార్ట్ 2ను అదే రేంజ్‌లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.   

ఇక సలార్ మూవీ నైజాం (తెలంగాణ) గడ్డపై రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మూడో సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. ఈ మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్స్ విషయానికొస్తే.. షారుఖ్ హీరోగా నటించిన 'డంకీ' సినిమాతో పోటీ కారణంగా తక్కువ స్క్రీన్స్ దక్కాయి. అయినా.. అక్కడ కూడా మంచి వసూళ్లనే సాధించింది. అక్కడ ఈ మూవీ ఓవరాల్‌గా రూ. 150 కోట్ల నెట్ వసూళ్లతో దుమ్ము దులిపింది. ఓవరాల్‌గా రూ. 153.45 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు సమాచారం.

మొత్తంగా సినిమా హిందీలో రూ. 75 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టోటల్ రన్ ముగిసే సమయానికి హిందీలో రూ. 76.50 కోట్ల రేంజ్‌లో షేర్ సొంతం చేసుకొని బాలీవుడ్‌లో హిట్ స్టేటస్ అందుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 78 కోట్ల బిజినెస్‌కు రన్ కంప్లీట్ అయ్యేవరకు రూ. 80.90 కోట్ల రేంజ్‌ను చేసుకొని సొంతం చేసుకొని పరుగును పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా ఈ మూవీ హిందీ సహా రెస్ట్ ఆఫ్ భారత్‌లో హిట్ అందుకుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News