Prabhas Kalki Shooting Update: ఈ రోజుతో ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి.. గుమ్మడికాయ కొట్టనున్నచిత్ర యూనిట్..?

Prabhas Kalki Shooting Wrapped up: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా ప్యాన్ వరల్డ్ లెవల్లో భారీగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ రోజుతో కంప్లీట్ కానున్నట్టు సమాచారం. 

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 10, 2024, 12:37 PM IST
Prabhas Kalki Shooting Update: ఈ రోజుతో ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి.. గుమ్మడికాయ కొట్టనున్నచిత్ర యూనిట్..?

Prabhas Kalki Shooting Wrapped up: ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  'కల్కి 2898 AD' మూవీ చేస్తున్నాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే  వంటి స్టార్ కాస్ట్ ఈ మూవీ భారీ ఎత్తున తెరకెక్కించాడు.  ముందుగా కల్కి సినిమాను సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత మే 9 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉంది. ప్రజలందరి మూడో దానిపైనే ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మే 13న పోలింగ్ డేట్ ఉంది. తెలంగాణలో లోక్‌సభ  ఎన్నికలు.. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మే 9న విడుదల చేయడం డౌటే అని చెబుతున్నారు. పైగా ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీ.. అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ జూ 4 రిజల్డ్ డేట్ వరకు ఉంటుంది. దీంతో మే 9న ఈ సినిమా విడుదల చేయడం డౌటే అని చెప్పాలి. ఆ సంగతి పక్కన పెడతే..ఈ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ నేటితో కంప్లీట్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గుమ్మడి కాయ కొట్టనున్నారు.

ఓ వైపు ఈ సినిమా షూటింగ్ చేస్తూనే నాగ్ అశ్విన్ మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు వచ్చిన ఔట్ పుట్ పై సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో మరో మైలు స్టోన్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాను మే 30న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు తెలుగు నుంచే ఎక్కువ రెవెన్యూ వసూళు చేయాలి. ఆ తర్వాత హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బాగా పర్ఫామ్ చేస్తేనే ఈ సినిమా సేఫ్ అయ్యే అవకాశాలున్నాయి.  ముఖ్యంగా కల్కి మూవీకి ఎక్కువ కలెక్షన్స్  రావాలంటే ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయాల్సిందే. ప్రస్తుతం పోలీస్ ఇతర ప్రభుత్వ యంత్రాగం మొత్తం ఎలక్షన్స్ పైనే దృష్టి కేంద్రీకరిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు స్పెషల్ షో పర్మిషన్స్.. రావడం కష్టమనే చెప్పాలి.  అందుకే ఈ సినిమాను మే 30 వ తేదిన రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.  అప్పటికే అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 1న చివరి విడత ఎన్నికలుంటాయి. ఈ సినిమా స్పెషల్ షో కోసం ఏపీలో ప్రభుత్వం నుంచి కాకుండా అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. దీంతో ఆ డేట్‌ లో మరే పెద్ద సినిమాలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ రావడం లేదు. పైగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఈ డేట్ సేఫ్ అని చెబుతున్నారు. పైగా స్కూల్, కాలేజీలు ఈ సినిమా విడుదలైన వారం పది రోజులు వరకు సెలవులు ఉంటాయి. అది ఈ సినిమాకు కలిసొచ్చే  అవకాశాలున్నాయి.

ఇక 'కల్కి' మూవీ మహాభారత కాలంతో  మొదలై సామాన్య శకం 2898 ADతో ముగుస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.  మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని 'కల్కి' మూవీలో ప్రేక్షకులకు చూపించబోతున్నారు. అంతేకాదు ఇందులో  నాటి రోజులకు తగ్గట్టు భారతీయత ఉట్టిపడేలా ఓ కొత్త ప్రపంచాన్నే ఈ సినిమా యూనిట్ క్రియేట్ చేసిందని చెప్పారు. ఈ సినిమా తర్వాత ముందుగా మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీని చేయనున్నారు ప్రభాస్.  ఆ తర్వాత  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ ఉండనే ఉంది. అటు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ఘార్ధ్ ఆనంద్, అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేస్తున్నాడు. అటు కన్నప్ప సినిమాలో ప్రభాస్.. మహా శివుడి పాత్రలో  కనిపించబోతున్న సంగతి తెలిసిందే కదా.  

Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News