Akhil-Samantha: మరోసారి అఖిల్ కోసం సమంత…ప్రతి సంవత్సరం అక్కినేని వారసుడు కోసం!!

Akhil: సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. తరచూ వీరిద్దరూ బంధం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వీరిద్దరూ ఎందుకు విరిపోయారు అనే దానిపైన తమకు తగిన థియరీస్ అభిమానులు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు…  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 9, 2024, 10:07 AM IST
Akhil-Samantha: మరోసారి అఖిల్ కోసం సమంత…ప్రతి సంవత్సరం అక్కినేని వారసుడు కోసం!!

Samantha: అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటించిన మొట్టమొదటి సినిమా ఏం మాయ చేసావే. ఆ సినిమాతోనే ఈ జంట తెలుగు అభిమానులను మాయ చేసింది. ఇక ఆ తరువాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటి ఎన్నో సినిమాలలో కనిపించి మెప్పించింది. ఇక అందరి ఆశలకి తగినట్టే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఆ తరువాత కొద్ది రోజులకు అనుకోని కారణాలవల్ల విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరి అభిమానులు వీరిద్దరి విడాకుల గురించి బాధపడుతూనే ఉన్నారు. 

కాగా విడాకులు తీసుకున్న తర్వాత కొన్నిసార్లు ఒకటి గురించి ఒకరు ప్రస్తావించిన అసలు విడాకుల కారణం మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఇక విడాకుల అనంతరం సమంతా కూడా నాగచైతన్య ఫ్యామిలీతో మాట్లాడినట్టు ఎప్పుడు కనిపివ్వలేదు. కాగా ఈ హీరోయిన్ అక్కినేని కుటుంబానికి సంబంధించి అఖిల్ తో మాత్రం ప్రస్తుతానికి కూడా బాగానే ఉన్నట్టు ప్రతి సంవత్సరం అఖిల్ పుట్టినరోజు వచ్చినప్పుడు అర్థమవుతుంది.
ఎందుకంటే నాగచైతన్య, నాగార్జున పుట్టినరోజు ఒక్క పోస్ట్ కూడా పెట్టని సమంత అఖిల్ బర్తడే వస్తే మాత్రం తప్పకుండా విష్ చేస్తుంది.

గత సంవత్సరం ఇలానే చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ హీరోయిన్. తాజాగా మరోసారి అఖిల్ కి బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్ట్ వేశారు సమంత. అఖిల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లోని ఫోటోని తన స్టోరీలో షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్ డే అఖిల్. ఈ ఇయర్ నీకు వండర్‌ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లేస్ యూ” అంటూ పోస్ట్ వేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నాగచైతన్యతో విడిపోయిన తరువాత నుంచి కూడా సమంత ప్రతి ఏడాది అఖిల్ కి విషెస్ తెలియజేస్తూ వస్తున్నారు.

మరోపక్క సమంతా పుట్టినరోజు నాగచైతన్య తప్ప దాదాపు అందరూ అక్కినేని వారసులు ఆమెకు విషెస్ తెలియజేస్తూ ఉంటారు. ఇక సమంత కూడా వారికి తమ విషెస్ తెలియజేస్తూ ఉండడం అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటోంది.

Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...

Also Read: TS Weather: తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి ఊరట.. రాగల మూడు రోజులు వర్షాలు

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News