Srinu Vaitla: విడాకులకు సిద్దమైన డైరెక్టర్ శ్రీను వైట్ల-రూప వైట్ల.. అసలు ఏమైందంటే?

Srinu Vaitla and his wife Roopa heading to divorce: బ్లాక్ బస్టర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల విడాకులు తీసుకోబోతున్నారు అని తెలుస్తుంది. శ్రీను వైట్ల భార్య రూప నాంపల్లి కోర్టులో విడాకుల కోసం అప్లై చేసినట్లు సమాచారం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 03:29 PM IST
  • విడాకులకు సిద్దమైన డైరెక్టర్ శ్రీను వైట్ల-రూప వైట్ల

    విడాకులకు ఫైల్ చేసిన రూప

    అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్

Srinu Vaitla: విడాకులకు సిద్దమైన డైరెక్టర్ శ్రీను వైట్ల-రూప వైట్ల.. అసలు ఏమైందంటే?

Srinu Vaitla and his wife Roopa heading to divorce: సినీ పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు విడాకులు అనేది చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికే చాలా మంది నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న దాఖలాలు మరిచిపోకముందే మరో సినీ జంట విడాకులు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. అది మరెవరో కాదు, అనేక కామెడీ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీనువైట్ల విడాకులు తీసుకోబోతున్నారు అని తెలుస్తుంది.

తెలుగులో ఆనందం, వెంకీ, ఢీ, దూకుడు, ఆగడు, దుబాయ్ శీను లాంటి అనేక సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల సుమారు 19 ఏళ్ల క్రితం రూప అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు కాస్ట్యూమ్ డిజైనింగ్ లో శిక్షణ ఇప్పించి ఆవిడను తన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా నియమించుకున్నారు. అలాగే ఆమె కొంత మంది సెలబ్రిటీలకి పర్సనల్ డిజైనర్ గా కూడా పని చేసేవారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట సుమారు నాలుగేళ్ల నుంచి విడిగానే ఉంటున్నట్లు సమాచారం.

ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వీరిద్దరూ అప్పటి నుంచే వేరుగా ఉంటున్నారట.  తాజాగా రూప నాంపల్లి కోర్టులో విడాకుల కోసం అప్లై చేసినట్లు సమాచారం. ఇది మ్యూచువల్ డైవర్స్ కాదని తాను తన భర్త నుంచి విడాకులు కోరుతున్నట్లుగా రూప విడాకులు కోరడం ఇప్పుడు ఆవశక్తికరంగా మారింది. అయితే డైవర్స్ తీసుకోవడం శ్రీను వైట్లకి ఇష్టమా లేదా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. కానీ ఆమె ఆయన భార్యగా ఉండలేనని అంటున్నట్టు తెలుస్తోంది.

నిజానికి సమంతకు ఆమె పర్సనల్ డిజైనర్ గా ఉండేవారు కానీ కొన్నాళ్ల క్రితమే సమంత ఆమెను మార్చి వేరే వారిని తన పర్సనల్ డిజైనర్ గా నిర్మించుకున్నారు. ఇక రూపా ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ స్టోర్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల సినిమాల విషయానికి వస్తే చివరిగా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేసిన అయన విష్ణు మంచు హీరోగా ఢీ 2 ప్రకటించారు. అయితే ఆ సినిమా ఆగిపోయినట్టు చెబుతున్నారు. అయితే మొత్తం మీద టాలీవుడ్ నుంచి మరో విడాకుల వ్యవహారం తెర మీదకు రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయం మీద అటు శ్రీనువైట్ల కానీ ఆమె భార్య రూప కానీ అధికారికంగా స్పందించలేదు. 

Also Read: Sushmita Sen: లలిత్ కంటే ముందు పది మందితో డేటింగ్.. హీరోలు మొదలు క్రికెటర్ దాకా.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

Also Read: Tollywood Shootings Bundh: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. షూటింగ్స్ బంద్?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News