Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట

Tamannaah Bhatia Dating తమన్నా ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. విలన్‌తో ప్రేమలో పడ్డ తమన్నా.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో రెచ్చిపోయింది. గోవాలో ముద్దులు, హగ్గులు అంటూ హంగామా చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 12:05 PM IST
  • ప్రేమలో పడ్డ మిల్కీ బ్యూటీ
  • గోవాలో ముద్దులాటలో తమన్నా
  • విలన్‌తో తమన్నా లవ్ స్టోరీ
Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట

Tamannaah Vijay Varma Dating మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హిందీ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్టున్నట్టుగా కనిపిస్తోంది. తమన్నా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా గోవాలో సందడి చేసింది. తన లవర్ విజయ్ వర్మతో కలిసి కనిపించింది. హగ్గులు, ముద్దులతో ఈ జంట హంగామా చేసింది. అయితే తమన్నా లవర్ విజయ్ వర్మ మన తెలుగు వారికి విలన్‌గా సుపరిచితుడే. నాని నటించిన ఎంసీఎ సినిమాలో విలన్‌గా కనిపించాడు విజయ్ వర్మ.

తమన్నా ప్రేమలో ఉన్నట్టుగా ఇన్ని రోజులు ఎక్కడా కూడా లీక్స్ బయటకు రాలేదు. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగానే ఈ వార్తలు బయటకు వచ్చాయి.ఇన్ని రోజులు తమన్నా తన సినిమాలతోనే బిజీగా ఉందని అనుకున్నారు. కానీ ఇలా ప్రేమ వ్యవహారంలోనూ బిజీగా ఉందని ఎవ్వరూ ఊహించలేదు. ఒక్కసారిగా విజయ్ వర్మతో ఇలా కనిపించడంతో తమన్నా అభిమానులు షాక్ అయ్యారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BollyBachhan (@bolly_bachhan)

తమన్నాకు ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ఆమె చేసిన సినిమాలు కూడా వర్కౌట్ అవ్వడం లేదు. చివరగా వచ్చిన గుర్తుందా శీతాకాలం సినిమా ఫ్లాప్ అయింది. ఇక హిందీలో చేసిన బబ్లీ బౌన్సర్ సినిమా వచ్చింది.. పోయింది కూడా తెలియడం లేదు. అలా తమన్నా సినీ కెరీర్ ప్రస్తుతం అంత బాగోలేదని చెప్పొచ్చు.

మాస్ మసాలా కమర్షియల్ సినిమాగా వచ్చిన సీటీమార్ సైతం తమన్నాకు ఉపయోగపడలేదు. ఆహా కోసం చేసిన వెబ్ సిరీస్‌ కూడా కలిసి రాలేదు. అలా తమన్నా కెరీర్ ఇప్పుడు కాస్త డౌన్లో ఉంది. అయితే అంధాదున్ తెలుగు రీమేక్‌లో విలన్‌గా నటించి మెప్పించింది. మొదటి సారిగా తమన్నాలోని ఈ యాంగిల్ చూసి ఆడియెన్స్ సైతం అవాక్కయ్యారు.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News