High Cholesterol: అధిక కొలెస్ట్రాల్ కారణంగా మహిళల్లో వచ్చే కొత్త లక్షణాలు ఇవే!

High Cholesterol In Females: శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగడం కారణంగా చాలా మందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళ్లలో కొత్త కొత్త లక్షణాలు వస్తున్నాయి. అయితే మీలో కూడా ఇలాంటి కొత్త సంకేతాలు వస్తే జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 7, 2024, 02:36 PM IST
High Cholesterol: అధిక కొలెస్ట్రాల్ కారణంగా మహిళల్లో వచ్చే కొత్త లక్షణాలు ఇవే!

High Cholesterol In Females: మన శరీరంలో మంచి కొవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ శరీరంలోని కొత్త కణాలను ఏర్పాటు చేయడమే కాకుండా దెబ్బతిన్న కణాలను మెరుగు పరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. ఇందులో మంచి కొలెస్ట్రాల్‌ శరీరానికి సహాయపడితే, చెడు కొవ్వు మాత్రం శరీరాన్ని దెబ్బతీస్తుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో విచ్చలవిడిగా కొవ్వు పెరిగిపోతోంది. దీని కారణంగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య పురుషుల కంటే మెనోపాజ్ అయిన మహిళల్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్‌ ఉంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడే స్త్రీలు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మహిళల్లో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంపై వచ్చే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు:
శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే శరీరంపై అనేక లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా స్త్రీలలోనైతే విభిన్న సంకేతాలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు ఏర్పడితే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపశమనం పొందడం చాలా మంచిది. లేకపోతే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది. 

ఆడవారిలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు:
శరీరంలో అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దీని కారణంగా హార్ట్‌కి రక్త సరఫరా కూడా ఆగిపోయే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఇది రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీయోచ్చు. ముఖ్యంగా కొంతమందిలోనైతే.. తరచుగా ఛాతీ నొప్పి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే స్త్రీలలో తరచుగా ఈ నొప్పులతో బాధపడితే తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

కాళ్ళలో నొప్పి:
కొంతమంది స్త్రీలలో కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల కాళ్ళలో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు కాళ్లలో రక్తనాళాలు దెబ్బతినడం వల్లే ఇలాంటి నొప్పులు వస్తున్నాయి. అలాగే కొంతమందిలో పాదాల్లో కూడా ఈ నొప్పులు వస్తాయి. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడే మహిళలు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

చెమటలు రావడం:
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కొంతమంది మహిళల్లో విపరీతంగా చెమటలు పట్టడం, దమ్ము రావడం వంటి సమస్యలు వస్తాయి. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవడం మంచిది. గుండె ఆక్సిజన్ సరఫరా లేకపోవడానికి కారణంగా ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News