Pudina Health Benefits: పుదీనాపై తాజా పరిశోధన, ఒత్తిడి దూరం చేయడంలో అద్భుత ఔషధం

Pudina Health Benefits: ప్రతి వంటింట్లో సాధారణంగా కన్పించేది పుదీనా. మింట్‌గా పిల్చుకునే పుదీనాతో నిజంగానే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పుదీనాలో ఉన్నన్ని ఔషధ గుణాలు మరెందులోనూ లేవంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2022, 11:00 AM IST
Pudina Health Benefits: పుదీనాపై తాజా పరిశోధన, ఒత్తిడి దూరం చేయడంలో అద్భుత ఔషధం

Pudina Health Benefits: ప్రతి వంటింట్లో సాధారణంగా కన్పించేది పుదీనా. మింట్‌గా పిల్చుకునే పుదీనాతో నిజంగానే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పుదీనాలో ఉన్నన్ని ఔషధ గుణాలు మరెందులోనూ లేవంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..

నాన్ వెజ్ కావచ్చు..వెజ్ కావచ్చు. వంట ఏదైనా సరే పుదీనా భారతీయ వంటల్లో తరచూ వాడుతుంటారు. అందుకే ప్రతి వంటింట్లో కామన్ గా లభ్యమవుతుంది. వండే వంటలకు అదనపు ఫ్లేవర్ అందిస్తుంది. అంతేకాదు పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పుదీనాలో ఔషధ గుణాలెక్కువ. చాలా రకాల రుగ్మతలు పుదీనాతో దూరమవుతాయి. పుదీనాతో ఏ విధమైన ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయో చూద్దాం.

పుదీనాలో కేలరీలు (Pudina Benefits)చాలా తక్కువగా ఉంటాయి గానీ కొవ్వు పదార్ధాలు మాత్రం ఎక్కువే ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, డీ, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ విటమిన్లు చర్మానికి ఆరోగ్యాన్నిస్తాయి. అంతేకాకుండా పుదీనాలో అధిక మోతాదులో ఉండే ఐరన్, పొటాషియం, మాంగనీస్ వంటివి శరీరంలో రక్త శాతం పెంచడం, మెదడు పనితీరు మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది. పుదీనా తరచూ తీసుకోవడం ద్వారా ఆస్తమాను కూడా నియంత్రించవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

పుదీనాలో ప్రధానంగా కన్పించేది మెంథాల్ (Menthol). అందుకే మింట్ లీవ్స్‌గా పిలుస్తారు. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పుదీనా రసం రాసి..మసాజ్ చేసుకుంటే ప్రయోజనముంటుంది. పుదీనాతో అరోమా థెరపీ కూడా ఉంది. అంటే పుదీనా వాసన చూడటం ద్వారా ఒత్తిడి దూరం చేసుకోవచ్చనేది తాజా పరిశోధనలో తేలింది. మెదడులోని కార్టిసాల్ స్థాయిని నియంత్రించడం ద్వారా విశ్రాంతి ఇస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. పుదీనాతో బరువు (Pudina for Weight Loss) కూడా తగ్గుతుందట. పుదీనాలో ఉండే ఆమ్లాలు జీర్ణ ప్రక్రియను సక్రమం చేస్తుంది. ఫలితంగా సహజసిద్ధంగానే బరువు తగ్గవచ్చు. పుదీనాను ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యపర ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. 

Also read: Omicron Variant Symptoms: డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాల్లో తేడాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News