Supreme Court: బ్యాలెట్ పేపర్ సాధ్యం కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ పూర్తిగా అవాస్తవం

Supreme Court: ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈవీఎం ట్యాంపరింగ్, వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపు అంశాపై దాఖలైన పిటీషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2024, 07:33 AM IST
Supreme Court: బ్యాలెట్ పేపర్ సాధ్యం కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ పూర్తిగా అవాస్తవం

Supreme Court: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీవ్లల అవకతతవకలు, బ్యాలెట్ పేపర్ ఎన్నిక, వీవీ స్లిప్పులు పూర్తిగా లెక్కించడం వంటి అంశాలపై దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు  న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసం విచారించింది. కీలకమైన తీర్పు ఇచ్చింది. 

ఈవీఎంలన ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవస్థలో పూర్తి భద్రత ఉందని ముఖ్యంగా పోలింగ్ బూత్ ఆక్రమణ, దొంగ ఓట్లు వేయడాన్ని నియంత్రించవచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈవీఎంలలో అక్రమాలు జరిగినట్టుగా ఇప్పటివరకూ ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ఈవీఎంలపై ఉన్న అనుమానాలకు ఆదారాల్లేవని తెలిపింది. అంతేకాకుండా వీవీ ప్యాట్ స్లిప్పులను నూటికి నూరు శాతం లెక్కించడం కుదరదని తేల్చిచెప్పింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలకు సమాధానమిస్తూ అన్ని పిటీషన్లను కొట్టివేసింది. 

అదే సమయంలో ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు జారీ చేశారు. ఎన్నికల సంఘం ఫలితాలు వెలువడిన తరువాత సింబల్ లోడింగ్ యూనిట్లు సీల్ చేయడం, కంటైనర్లలో భద్రపర్చడం, స్ట్రాంగ్ రూమ్‌లో కనీసం 45 రోజులు స్టోర్ చేయడం చేయాలని సూచించింది. ఎన్నికల్లో ఎదైనా నియోజకవర్గంలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్ధులు ఫలితాలు వెలువడిన వారం రోజుల్లోగా తగిన రుసుమతో మైక్రో కంట్రోలర్ల ధృవీకరణను కోరవచ్చు. ఈవీఎం కంపెనీ ఇంజనీర్లు ఇది చేయాల్సి ఉంటుంది. 

ఈవీఎంలతో ప్రయోజనాలున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక నిమిషానికి 4 కంటే ఎక్కువ ఓట్లను ఈవీఎం అనుమతించనందున పోలింగ్ బూత్‌ల ఆక్రమణకు అవకాశముండదని సుప్రీంకోర్టు వివరించింది. ఈవీఎంలను తారుమారు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. వీవీ ప్యాట్ స్లిప్పులు ర్యాండమ్ చెక్ కోసమే తప్ప 100 శాతం లెక్కింపు కుదరదని తెలిపింది. 

ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ ఓటింగ్ నిర్వహించాలన్న పిటీషనర్ల అభ్యర్ధనను జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరస్కరించారు. కొత్త విధానానికి అలవాటు పడిన తరువాత తిరిగి పాత విధానానికి వెళ్లడమంటే ఎన్నికల సంస్కరణలు రద్దు చేయడమేనని తెలిపారు. 97 కోట్ల ఓటర్లు, పోటీ చేసే అభ్యర్ధుల సంఖ్య, సమయం వంటి అంశాలను పరిగణలో తీసుకుంటే ఈవీఎంలే సరైన విధానమని సుప్రీంకోర్టు వెల్లడించింది. 

Also read: Lok Sabha Elections: రెండో దశ ప్రశాంతం.. ఓటు వేసిన సినీ స్టార్లు, రాజకీయ ప్రముఖులు>

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News