PMS Symptoms: నెలసరి ముందు విపరీతమైన కోపం వస్తుందా?అయితే తేలిగ్గా తీసుకోకండి..

Pre Menstrual Syndrome : కొన్ని సార్లు పీరియడ్‌ వచ్చే ఒక వారం.. రెండు వారాల ముందు కొన్ని ప్రాబ్లమ్స్‌ కూడా వస్తూఉంటాయి. అవి పీరియడ్స్ సమయంలో హార్మోన్‌లలో మార్పుల వల్ల వస్తాయి అని అంటారు చాలామంది. ఉదాహరణకి టెన్షన్, కోపం, చిరాకు, డిప్రెషన్ లాంటి లక్షణాలు ఉండచ్చు. దీన్ని ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ అని అంటారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 7, 2024, 10:44 PM IST
PMS Symptoms: నెలసరి ముందు విపరీతమైన కోపం వస్తుందా?అయితే తేలిగ్గా తీసుకోకండి..

Mood Swings During Periods: పీరియడ్స్ ప్రతి స్త్రీ ఎదుర్కొనేదే అయినప్పటికీ, కొందరికి మాత్రం పెద్ద సమస్యలాగానే అనిపిస్తుంది. కొందరు మహిళలు పీరియడ్స్ సమయంలో కూడా పెద్దగా నొప్పి లేకుండా కొన్ని పనులు చేయగలరు. కానీ కొంతమంది స్త్రీలకు మాత్రం నెలసరి పెద్దగండంలాగా అనిపిస్తుంది. ఆ సమయంలో వారికి కడుపు నొప్పి, నడుము నొప్పు, కాళ్లు లాగడం వంటివి భరించలేనంతగా ఉంటాయి. 

ఇక కొంతమందిలో ఈ ఇబ్బందులు పీరియడ్‌ వచ్చే రెండు వారాల ముందు నుండే మొదలవుతాయి. హార్మోన్‌లలో జరుగుతూ ఉండే మార్పుల కారణంగానే కొందరికి నెలసరి వచ్చే 15 రోజులు ముందు నుంచి టెన్షన్, కోపం, చిరాకు, డిప్రెషన్, అలసట, రొమ్ములు నొప్పిగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ అని అంటారు.

కొంతమంది మహిళలలో ఈ లక్షణాలను చాలా తక్కువగా ఉంటాయి. కానీ మరికొందరిలో మాత్రం ఈ నొప్పుల తీవ్రత భరించలేనంతగా ఉంటుంది. కనీసం ఇంటి పనులు చేయడం కష్టంగా ఉంటుంది. ఈ లక్షణాలను ప్రీ మెన్‌స్ట్రల్ సిండ్రోమ్ అని అంటారు.
కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి లక్షణాలు 85 శాతం మందిలో తక్కువగానే ఉంటాయి కానీ 5 నుంచి 10 శాతం మహిళలలో మాత్రం ఈ లక్షణాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఈ లక్షణాల గురించి లైఫ్‌లైన్ లాబొరేటరీ డైరెక్టర్, డాక్టర్ ఏంజెలీ మిశ్రా కూడా ఈ మధ్యనే మాట్లాడారు. 

కారణం ఇదే:

ఒవ్యూలేషన్‌ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. దానివల్ల చర్మంలోని గ్రంథులు ఉత్పత్తి చేసే నూనె (సెబెమ్) ఎక్కువ అవుతుంది. దాని వల్ల సెబమ్ ఉత్పత్తి అయినప్పుడు, మొటిమలు వస్తాయి. నెలసరి ముగిసే సరికి మళ్ళీ ఆ మొటిమలు పోతాయి. అందుకు కారణం ఆ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ తిరిగి పెరగడం. 

ఇంకా పీఏంఎస్ వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాలు ఉంటాయి. ఆ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్లే.. కారణం లేకుండా ఏడుపు రావడం, చిరాకుగా, కోపంగా ఉండడం లాంటివి జరుగుతాయి. పీరియడ్ దగ్గరకు వచ్చే కొద్ది శరీర ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే కొందరికి నిద్ర కూడా పట్టదు. 

తప్పించుకోవడానికి ఏమి చేయాలి?

ఈ నొప్పి లేదా లక్షణాలు తగ్గడం కోసం ఆక్యుపంక్చర్, రిలాక్సేషన్ టెక్నిక్స్, కోల్డ్ కంప్రెస్‌ పెట్టుకోవడం వంటివి ఫాలో అవ్వాలి.  మన శరీరం మళ్ళీ  సెరొటోనిన్ విడుదల చేయడం కోసం చాక్లెట్లు, కేకులు లాంటి తీపి పదార్థాలు తినాలని అనిపించేలా చేస్తుంది.  

కొందరికి పీరియడ్స్‌ ముందు విరేచనాలు, వికారంగా ఉండడం, గ్యాస్ట్రిక్‌ ఇబ్బందులు రావడం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఈ లక్షణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. ఆపిల్, బెర్రీలు, అవకాడో తీసుకోవడం కూడా ఈ సమయంలో చాలా మంచిది. వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకవడం వల్ల ఈ లక్షణాలను చాలా వరకు  నియంత్రించవచ్చు.

Read More: WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?

Read More: Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News