Curd side effects: పెరుగు హెల్త్ కు మంచిదే.. కానీ వీటితో కలిపి తింటే మాత్రం యమడేంజర్.. డిటెయిల్స్ మీకోసం..

Stop eating with curd: మనలో చాలా మంది అన్నంతిన్నాక చివరకు పెరుగు లేదా మజ్జీగ ను తింటు ఉంటారు. అయితే.. పెరుగును తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
 

1 /6

పెరుగును దోసకాయలతో కలిపి చాలా మంది తింటుంటారు. దోసకాయ, పొట్లాకాయలతో చట్నీలు కూడా చేసుకుంటారు. కానీ ఈ కాంబినేషన్ లో అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.  

2 /6

సాధారణంగా కొందరు స్పైసీ ఫుడ్ లను, పెరుగుతో కలిపి తింటారు. కారంగా,మంటగా అన్పించగానే వెంటనే పెరుగు వేసుకుని లాగించేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడని, దీని వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా పాడౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3 /6

పెరుగు పాల నుంచి వస్తుంది. పాలను తోడువేస్తే పెరుగు అవుతుంది. కానీ పెరుగును, పాలను ఒకేసారి కలిపి తినకూడదంట. పొరపాటున ఇలాతింటే కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడుతుందంట. అందుకే ఇలా తినొద్దని చెబుతుంటారు.  

4 /6

వేడి వేడి పదార్థాలు తినేటప్పుడు వెంటనే చల్లగా మారిపోవాలని, కొందరు పెరుగుతో కలిపితింటారు. ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అందుకే పదార్థాలు చల్లగా మారిన తర్వాత మాత్రమే పెరుగును కలిపి తినాలంట.  

5 /6

పుచ్చకాయలను, కొందరు పెరుగుతో కలిపి తింటుంటారు. ఈ రెండు పదార్థాలు కూడా పరస్పరం భిన్నమైన గుణాలు కల్గి ఉంటాయంట. అందుకే వాటర్ మిలన్ ను పెరుగుతో అస్సలు తినకూడని చెబుతున్నారు.

6 /6

ఇక నూడుల్స్, స్పైసీ ఫుడ్ లతో పెరుగును అస్సలు తినకూడదు. ఇలా చేస్తే, కడుపులో అజీర్తిగా మారిపోతుంది. తిన్న పదార్థాలు అరగక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు. కొందరిలో మలబద్దకం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.  Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)