Hamida banu: భారత్ తొలి రెజ్లర్ .. గూగుల్ డూడుల్ హమీదా భాను గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Google doodle Tribute: భారత్ తొలిరెజ్లర్ హమీదా బాను కు గూగుల్ డూడుల్ తో ఘననివాళి ఇచ్చింది. ఆమె 1950 దశకంలోనే మహిళలను తక్కువగా చూసేవారికి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. ఆమె రెజ్లింగ్ లో పురుష పహిల్వాన్ లను సైతం మట్టి కరిపించారు. ప్రస్తుతం హమీదా భాను విజయగాథ వార్తలలో నిలిచింది. 

  • May 04, 2024, 12:43 PM IST
1 /6

హమీదా బాను భారత్ చెందిన మొట్ట మొదటి రెజ్లర్. ఆమె 1950 లోనే పురుషులకు ధీటుగా రెజ్లింగ్ లో తన సత్తా చాటింది. హమీదా ఉత్తర ప్రదేశ్‌ లోని అలీఘడ్ లో 1900 లో జన్మించింది. చిన్న తనంనుంచి ఆమెకు రెజ్లింగ్ అంటే ఎంతో ఆసక్తిగా ఉండేది. దానిలో ఆమె ఎంతో ప్రావీణ్యం సాధించింది.

2 /6

ఆమెకుటుంబ సభ్యులుకూడా హమీదాను రెజ్లింగ్ వైపుకు ప్రోత్సహించారు. అప్పట్లో ఆడవాళ్లలకు అథ్లెటిక్ రంగంవైపు సపోర్ట్ చేసేవారుకాదు. అయిన కూడా.. ఆమె కష్టపడి మరీ రాణించింది. ఆమెను అలీగఢ్ కా అమెజాన్ అని పిలిచేవారు.

3 /6

కుస్తీలో తనను ఓడించిన వారిని పెళ్లి చేసుకుంటానని హమీదా సవాల్ విసిరింది. దీంతో 1954 ఫిబ్రవరి పటియాలా నుంచి ఒకరు,  కోల్ కతానుంచి మరోకరు వచ్చారు. వీరిద్దరిని హమీదా చిత్తుగా ఓడించింది. అదే ఏడాది వడోదరకు వెళ్లి సంచలనంక్రియేట్ చేశారు. బాబా పహిల్వాన్, హమీదాను పెళ్లి చేసుకొవడానికి తలపడ్డాడు. దీంతో ఆమె అతనితో తలపడింది. కానీ హమీదా చేతిలో బాబా పహిల్వాన్ ఓడిపోయాడు. 

4 /6

ఆ తర్వాత అతను రెజ్లింగ్ నుంచి తప్పుకున్నాడు. భారత్ మహిళ రెజ్లర్ లో ఆమె ఎంతో మన్ననలను పొందింది. ఆమెకు విపరీరతంగా ఫాలోయింగ్ ఉండేది. హమీదా.. 107  కేజీల బరువు ఉండేది. 5.3 అడుగుల ఎత్తును కల్గి ఉండేది. ఆమె తన ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా డైట్ ను ఫాలో అయ్యేది.

5 /6

హమీదా బాను..ప్రతిరోజు ఐదున్నర లీటర్ల పాలు, మూడు లీటర్ల సూప్, రెండున్నర లీటర్ల జ్యూస్, ఒక కోడి, కిలో మటన్, ఆరుగుడ్లు, 450 గ్రాముల బటర్, కిలో బాదం పప్పులు, రెండు ప్లేట్ లో బిర్యానీ తినేదంట. అంతేకాకుండా ప్రతిరోజు కోచ్ లో ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేసేదంట.

6 /6

అయితే.. లైఫ్ లో ఉన్నతంగా జీవించిపేరును గాంచిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం,వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఆమె తన కోచ్ తో సహజీవనం చేసేదంట. అయితే.. అతను ఆమెను ఎంతో వేధించాడని కూడా చెబుతుంటారు.  చివరి రోజుల్లో హమీదా ఎంతో కష్టపడిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుంటారు. కానీ హమీదా మాత్రం రెజ్లింగ్ రంగంలో రాణించిన విధానం, ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారు.