Ketika Sharma: హాట్ ఫోజులతో కెవ్వు కేక పుట్టిస్తోన్న కేతిక శర్మ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Ketika Sharma Latest Pics: టాలీవుడ్  సహా ప్రతి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు.. ఎప్పటికపుడు కొత్త హీరోయిన్లు  సినీ ఇండస్ట్రీలో పరిచయం అవుతూనే ఉంటారు. అందులో కేతిక శర్మ ముందు వరసలో ఉంటారు. ఈమె గ్లామర్ డాల్‌గా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో'లో నటించిన ఈ భామకు సరైన బ్రేక్ లభించడం లేదు. అందుకే గ్లామర్ షోను నమ్ముకుంది.

1 /6

కేతిక శర్మ.. కొంత మంది హీరోయిన్స్  ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు మొదటి సినిమాతోనే దక్కించుకుంటారు. అలాంటి వాళ్లలో కేతిక శర్మ ఒకరు.

2 /6

కేతిక శర్మ ముందు యూట్యూబర్‌గా కెరీర్ షురూ చేసింది. ఆపై సింగర్‌గా.. అటు తన డబ్ స్మాష్‌లతో వీడియోలతో బాగా పాపులర్ అయింది. అలా తన టాలెంట్‌తో సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. 

3 /6

పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్‌' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన కేతిక.. ఫస్ట్ సినిమాలోనే అందాల ఆరబోతతో సెగలు పుట్టించి వెండితెరను హీట్ ఎక్కించింది.

4 /6

రొమాంటిక్ మూవీలో కేతిక అందాల జాతరకు ప్రేక్షకులు సహా సినీ ఇండస్ట్రీ సైతం సాహో అంటూ సలాం కొట్టింది. దీంతో కేతికకు వరుస ఛాన్సులు వచ్చి పడుతున్నాయి. కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.

5 /6

లాస్ట్ ఇయర్  పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించింది. ఈ సినిమాతో ఈ భామకు ఒరిగిందేమి లేదు. పెద్ద హీరో సినిమాలో నటించానన్న సంతృప్తి తప్పితే.. ఈ మూవీలో కేతిక క్యారెక్టర్ కూరలో కరివేపాకు టైపు అయిపోయింది.

6 /6

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో తన లక్‌ను పరీక్షించుకుంది.