May 9 Tollywood Lucky Day: టాలీవుడ్ మోస్ట్ ల‌క్కీ డే.. మే 9.. గ్యాంగ్ లీడ‌ర్,మ‌హాన‌టి స‌హా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన సినిమాలు ఇవే..

May 9 Tollywood Lucky Day: టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని డేట్స్ ప్ర‌త్యేక‌మైన‌వి. ఆ రోజు విడుద‌లైన సినిమాలు తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. అందులో మే 9 ప్ర‌త్యేక‌మైన‌ది. ఈ రోజు విడుద‌లైన జ‌గ‌దేవ‌వీరుడు అతిలోక‌స‌సుంద‌రి, గ్యాంగ్ లీడ‌ర్,  సంతోషం, ప్రేమించుకుందాం రా,  మ‌హ‌ర్షి, మ‌హాన‌టి, భార‌తీయుడు వంటి ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ ఉన్నాయి.

1 /8

మ‌హ‌ర్షి  Maharshi (2019 May 9) మ‌హేష్ బాబు హీరోగా అల్ల‌రి న‌రేష్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ మ‌హ‌ర్షి. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ 2019 మే 9న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.మొత్తంగా వివిధ ఇయ‌ర్స్‌లో  మే9  విడుద‌లైన చిత్రాల్లో ఎక్కువ మ‌టుకు  బ్లాక్ బ‌స్ట‌ర్స్ గా నిలిచి టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో మైల్ స్టోన్‌గా నిలిచాయి.

2 /8

మ‌హాన‌టి.. Mahanati ( 2008 May 9) నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన మూవీ మ‌హాన‌టి. కీర్తి సురేష్ లీడ్ హీరోయిన్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా  న‌టించిన మూవీ 2008 మే 9న విడుద‌లైన సంచ‌ల‌న విజ‌యం సాధించింది.  

3 /8

సంతోషం.. Santhosham ( 2002 May 9) ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌, శ్రియ‌, గ్రేసీ సింగ్ హీరో, హీరోయిన్లుగా న‌టించిన మూవీ సంతోషం. ఈ సినిమా 2002 మే 9న సంచ‌ల‌న విజ‌యం సాధించింది.  

4 /8

ప్రేమించుకుందాం.. రా.. Preminchukundam Raa (1997 May 9) వెంక‌టేష్, అంజ‌లా ఝ‌వేరి హీరో, హీరోయిన్లుగా న‌టించిన మూవీ ప్రేమించుకుందాం.. రా మూవీ. జ‌యంత్ సి. ప‌రాన్జీ ద‌ర్శ‌కత్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్  పై తెర‌కెక్కిన ఈ మూవీ 1997 మే 9న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

5 /8

భార‌తీయుడు.. Bharatheeyudu (1996 May 9) క‌మ‌ల్ హాస‌న్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌నీషా కొయిరాల‌, ఊర్మిళ హీరో, హీరోయిన్లుగా న‌టించిన సినిమా భార‌తీయుడు.  ఈ సినిమా 1996 మే 9 న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

6 /8

గ్యాంగ్ లీడ‌ర్ - Gang Leader (1991 May 9) విజ‌య బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై   తెర‌కెక్కిన మూవీ  గ్యాంగ్ లీడ‌ర్. ఈ సినిమా 1991 మే 9 విడుద‌లైన చిరు కెరీర్‌లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

7 /8

జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి - Jagadeka veerudu Athiloka Sundari (1990 May 9) చిరంజీవి, శ్రీ‌దేవి హీరో, హీరోయిన్లుగా వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై సి అశ్వ‌నీదత్ నిర్మాణంలో కే.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మే 9న విడుద‌లైన ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

8 /8

మొత్తంగా వివిధ ఇయ‌ర్స్‌లో  మే9  విడుద‌లైన చిత్రాల్లో ఎక్కువ మ‌టుకు  బ్లాక్ బ‌స్ట‌ర్స్ గా నిలిచి టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో మైల్ స్టోన్‌గా నిలిచాయి.