Summer Heat: భగ్గుముంటున్న ఎండలు.. బైటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. నిపుణుల సూచనలివే..

1 /6

ఎండలు రోజు రోజుకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం పది దాటిందంటే చాలు. భానుడు భగ భగ మండిపోతున్నాడు.బైటకు వెళ్లాలంటేనే జనాలు భయంతో వణికిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లవద్దని ప్రజలను నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

2 /6

తెలుగు రాష్ట్రాలలో ఒకవైపు ఎండల వేడీ,మరోవైపు ఎన్నికల వేడీ కొనసాగుతున్నాయి. ఎండలు అనేక చోట్ల 45 డిగ్రీలుదాటేసి యాభై డిగ్రీల వైపుకు పరుగులు తీస్తుంది. దీంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల పండుటాకులు వడదెబ్బ ప్రభావంతో చనిపోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.   

3 /6

ఎండలో బైటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా బాగా నీళ్లను తాగి వెళ్లాలి, ఒక వాటర్ బాటిల్, గొడుగును తప్పనిసరిగా పెట్టుకొవాలి. గొడుగు లేకుంటే టోపీలు సైతం పెట్టుకొవచ్చు. ఎండలో చల్లని బట్టను నీళ్లలో నానబెట్టి, తలకు చుట్టుకొవాలి.ఇలా చేయడం వల్ల ఉపశమనం కల్గుతుంది.

4 /6

సమ్మర్ లో బైటకు వెళ్లినప్పుడు దాహాంవేసిన, వేయకున్న నీళ్లను మాత్రం తీసుకుంటు ఉండాలి. జ్యూస్ లు ఎక్కువగా తాగుతుండాలి. నీళ్లను తాగకుంటే..బాడీ అంతా ఒక్కసారిగా డీహైడ్రేషన్ కు గురిఅయిపోతుంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే వాటర్ మిలన్, దోసకాయ, కీర దోసకాలను ఎక్కువగా తినాలి.  

5 /6

సమ్మర్ లో టీలు, కూల్ డ్రింక్ లు , స్పైసీ ఫుడ్ లను ఎక్కువగా తినడం అవాయిడ్ చేయాలి. వదులుగా ఉండే దుస్తులను మాత్రమే వేసుకొవాలి. బిగుతుగా ఉండే దుస్తులు వేసుకొకూడదు. ఎండలో ఎక్కువగా శరీరం ఎక్స్ పోజ్ అయ్యేలా ఉండకూడదు.    

6 /6

మహిళలు ముఖ్యంగా స్కార్ఫ్ లను కట్టుకొవాలి. వృద్ధులు , చిన్న పిల్లలను ఎక్కువగా జాగ్రత్తగా ఉండేలా చూసుకొవాలి. నిరంతరం ఓఆర్ఎస్ ద్రావణం, ఫ్రూట్ జ్యూస్ లు, నిమ్మరసంలు ఎక్కువగా తాగిస్తు ఉండాలి.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)