మద్యం మత్తులో మరో యువతి మెడలో దండేసిన వరుడు.. వధువు ముందే చెప్పు దెబ్బలు! చివరికి ఏమైందంటే

BrideGroom Tying garland Another woman's neck, Bride Shocked. మద్యం మత్తులో ఉన్న వరుడు.. వధువు మెడలో కాకుండా మరో యువతి మెడలో పూలమాల వేసి అబాసుపాలయ్యాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 23, 2022, 09:46 PM IST
  • మద్యం మత్తులో మరో యువతి మెడలో దండేసిన వరుడు
  • వధువు ముందే చెప్పు దెబ్బలు
  • చివరికి ఏమైందంటే
మద్యం మత్తులో మరో యువతి మెడలో దండేసిన వరుడు.. వధువు ముందే చెప్పు దెబ్బలు! చివరికి ఏమైందంటే

Drinking BrideGroom Tying garland Another woman's neck: ప్రతి ఒక్కరి జీవితంలో 'పెళ్లి' అనేది చాలా ప్రత్యేకం. అందుకే ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఒక మెమోరబుల్ మూమెంట్‌గా మార్చుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తుంటారు. అయితే ఓ పెళ్లి కొడుకు మాత్రం తన పెళ్లిని చేదు జ్ఞాపకంగా మిగుల్చుకున్నాడు. పెళ్లి రోజున మండపంపై  చెప్పు దెబ్బలు తిన్నాడు. మద్యం మత్తులో మరో యువతి మెడలో పూలమాల వేసి అబాసుపాలయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 

వీడియో ప్రకారం... భారత దేశంలోని బీహార్‌ ప్రాంతంలో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి రోజున ఎంతో హుషారుగా ఉండాల్సిన వరుడు.. మద్యం సేవించాడు. పూటుగా తగిన అతడు స్పృహలో కూడా లేడు. అతడు నిలబడానికి మరొకరి సాయం తీసుకున్నాడు. జయమాల సమయం రానే వచ్చింది. వరుడి మెడలో వధువు జయమాల వేసింది. వరుడి మాత్రం తగిన మైకంలో వధువు మెడలో కాకూండా.. పక్కన హారతి పట్టుకున్న తన కోడలి మెడలో వేస్తాడు. ఇది చుసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోతుంది. 

తా చేతిలో ఉన్న హారతి పళ్లాన్ని పక్కన పెట్టి చెప్పుతో వరుడి చెంపలు వాయించింది. నా మెడలో ఎందుకు వేశావ్ అని, వెంటనే తీసేయ్ అంటూ బాదింది. వధువు కొట్టొదని కోరినా ఆమె ఆగలేదు. చివరకు వరుడు ఆమె మెడలో నుంచి దండను తీసేశాడు. ఇందుకు  సంబందించిన వీడియోను @Vikki19751 అనే ట్విట్టర్ వినియోగదారు పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ వీడియో చుసిన వారు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే దీన్ని రూపొందించారని అంటున్నారు. ఏదేమైనా ఈ ఘటన అందరిచే నవ్వులు పూయిస్తోంది. 

Also Read: Sammathame Tickets: మరికొన్ని గంటల్లో 'స‌మ్మ‌త‌మే' సినిమా రిలీజ్.. కామెంట్ చేస్తే ఫ్రీగా టికెట్!

Also Read: Rohit Sharma Debut: 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ పూర్తి.. ఎమోషనల్‌ అయిన రోహిత్‌ శర్మ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News