Bridegroom Funny Video: వరుడి ప్యాంటు ఊడిపోయింది.. వధువు నవ్వు ఆపుకోలేకపోయింది!

Funny Video: Bridegroom pant slips Down at Marriage Stage. తాజాగా వరుడికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. వరుడి ప్యాంటు ఊడిపోవడంతో వధువు నవ్వు ఆపుకోలేకపోయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 08:20 PM IST
  • స్టేజ్‌పైనే ఊడిన వరుడి ప్యాంట్
  • పగలబడి నవ్విన వధువు
  • ఎమోజీలు, కామెంట్ల వర్షం
Bridegroom Funny Video: వరుడి ప్యాంటు ఊడిపోయింది.. వధువు నవ్వు ఆపుకోలేకపోయింది!

Bridegroom pant slips Down at Marriage Stage, Bride Can not Stop Laughing: ప్రస్తుతం భారత దేశంలో వివాహాల సీజన్ నడుస్తోంది. దాంతో వధూవరులకు సంబంధించిన పలు ఆసక్తికరమైన మరియు ఉల్లాసకరమైన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొందరు వైరల్ అవ్వడానికి కావాలనే ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేస్తుంటారు. మరోవైపు సహజంగానే కొన్ని ఫన్నీ సంఘటనలు జరిగిపోతుంటాయి. ఈ క్రంమలోనే తాజాగా వరుడికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. వరుడి ప్యాంటు ఊడిపోవడంతో వధువు నవ్వు ఆపుకోలేకపోయింది. 

వధూవరులు పెళ్లి వేదికపై ఉన్నారు. బంధువులు, స్నేహితులు అంతా వారిముందు కూర్చున్నారు. వధువు వరుడు దండలు వేసుకునే సమయం వచ్చింది. ముందుగా వధువు.. వరుడు మెడలో దండ వేసింది. ఆపై వరుడు కూడా వధువు మెడలో దండ వేశాడు. అయితే అదే సమయంలో వరుడి ప్యాంట్ ఊడిపోయింది. అప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న అతిథులు ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు. ఏం జరిగిందో తెలియక వరుడు అయోమయంలో పడ్డాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

ప్యాంట్ ఊడిపోవడం చుసిన వధువు కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. విషయం తెలుసుకున్న వరుడు వెంటనే ప్యాంట్‌ను సరిచేసుకున్నాడు. ఆపై అతడు కూడా నవ్వులు పూయించాడు. మొత్తానికి వరుడు ఘటనతో అక్కడ అందరూ బాగా నవ్వుకున్నారు. ఈ వీడియో bhutni_ke_memes అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. 2 రోజుల క్రితం షేర్ చేయబడిన ఈ వీడియోకి 8828 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు అందరూ ఎమోజీలు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: Rajat Patidar Marriage: ఐపీఎల్ 2022 కోసం.. పెళ్లి వద్దనుకున్న బెంగళూరు ఆటగాడు రజత్ పటీదార్!

Also Read: Pawan Kalyan in F3: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. ఎఫ్3 సినిమాలో పవన్ కళ్యాణ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News