Cricketers List: పెళ్లి కాకుండా తండ్రులైన క్రికెటర్లు వీరే, జాబితాలో టీమ్ ఇండియా హార్దిక్ పాండ్యా

Cricketers List: ప్రపంచంలో అత్యంత ఆదరణ సంపాదించుకున్న క్రికెటర్లకు సంబంధించి ఆసక్తి కల్గించే అంశాలు చాలానే ఉన్నాయి. ఇవాళ చెప్పే అంశం..పెళ్లికి ముందే తండ్రైన క్రికెటర్ల గురించి. ఇందులో భారతీయ క్రికెటర్లు కూడా ఉన్నారు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 9, 2022, 11:53 PM IST
Cricketers List: పెళ్లి కాకుండా తండ్రులైన క్రికెటర్లు వీరే, జాబితాలో టీమ్ ఇండియా హార్దిక్ పాండ్యా

Cricketers List: ప్రపంచంలో అత్యంత ఆదరణ సంపాదించుకున్న క్రికెటర్లకు సంబంధించి ఆసక్తి కల్గించే అంశాలు చాలానే ఉన్నాయి. ఇవాళ చెప్పే అంశం..పెళ్లికి ముందే తండ్రైన క్రికెటర్ల గురించి. ఇందులో భారతీయ క్రికెటర్లు కూడా ఉన్నారు..

క్రికెటర్లకు సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలుంటాయి. కొందరు క్రికెటర్లకు వారి భార్యలు వయస్సులో పెద్దోళ్లైతే..మరి కొందరు భారతీయ మహిళల్ని పెళ్లి చేసుకున్నవాళ్లు. ఇంకొందరు విడాకులు తీసుకున్న మహిళల్ని రెండో పెళ్లి చేసుకున్న క్రికెటర్లు. ఇలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఇదే క్రికెటర్లకు సంబంధించిన మరో ఆసక్తి కల్గించే అంశముంది. అది పెళ్లికి ముందే తండ్రులైన క్రికెటర్ల వ్యవహారం.

ప్రేమలో మునిగి లేదా లివింగ్ టుగెదర్ కారణంగా పెళ్లికి ముందే తండ్రులైపోయారు కొందరు క్రికెటర్లు. ఇలా పెళ్లికి ముందే తండ్రులైన క్రికెటర్ల జాబితాలో ఒక భారతీయ క్రికెటర్ కూడా ఉన్నాడు. పెళ్లికి ముందే తండ్రులైన క్రికెటర్లు ఎవరో పరిశీలిద్దాం..

1. హార్దిక్ పాండ్యా. భారతీయ క్రికెటర్. పెళ్లికి ముందే తండ్రయ్యాడు. హార్దిక్ పాండ్యా జనవరి 1, 2020 న బాలీవుడ్ నటి నటాషా స్టాన్‌కోవిక్‌తో దుబాయ్‌లో నిశ్చితార్దం చేసుకున్నాడు. అదే ఏడాది జూలై 30వ తేదీన తన గర్ల్‌ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని హార్దిక్ పాండ్యా స్వయంగా వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా కొడుకు పేరు అగస్త్య. 

2. జో రూట్ ఇంగ్లండ్‌కు చెందిన క్రికెటర్. జో రూట్ కూడా పెళ్లి కాకుండానే తండ్రిగా మారాడు. 2014 నుంచి ఇతను తన గర్ల్‌ఫ్రెండ్ కైరీ కార్టెల్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్ కంటే ముందు 2016 మార్చ్‌లో ఇద్దరికీ నిశ్చితార్ధమైంది. పెళ్లి కాకుండానే జో రూట్ తండ్రయ్యాడు. 2017 జనవరి 7న జో రూట్‌కు అల్‌ఫ్రెడ్ అనే కొడుకు పుట్టాడు. ఆ తరువాతే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

3. డేవిడ్ వార్నర్ ఆస్టేలియా ఓపెనర్. పెళ్లి కాకుండానే తండ్రయ్యాడు. 2014లో డేవిడ్ వార్నర్ గర్ల్‌ఫ్రెండ్‌కు మొదటి కుమార్తె పుట్టింది. 2015లో డేవిడ్ వార్నర్ పెళ్లి చేసుకున్నాడు. వార్నర్‌కు ఇప్పుడు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇవీ పెళ్లికి ముందైతే..ఇండీ, ఇస్లాలు పెళ్లి తరువాత.

4. ఇక మరో వ్యక్తి పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ కూడా పెళ్లి కాకుండానే తండ్రయ్యాడు. ఇమ్రాన్‌కు సీతా వైట్‌తో ప్రేమాయణం, సంబంధముంది. ఇద్దరికీ సంబంధం 1987-88 లో ప్రారంభమై..1991లో చేరువయ్యారు. 1992లో ఓ కొడుకు పుట్టాడు. కాని ప్రారంభంలో ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని తిరస్కరించగా..డీఎన్ఏ ద్వారా విషయం వెల్లడైంది. 

5. వివియన్ రిచర్డ్స్ వెస్ట్‌ఇండీస్ మాజీ టాప్ క్రికెటర్. 1980లో ఇండియా పర్యటనలో రిచర్డ్స్ పరిచయం అప్పటి భారతీయ ప్రముఖ నటి నీనా గుప్తాతో జరిగింది. ఇద్దరి మధ్య ఎపైర్ అప్పట్లో అందరికీ తెలుసు. ఇద్దరూ కలిసి జీవించేవారు. 1989లో నీనా గుప్తాకు కుమార్తె జన్మించింది. పేరు మసాబా. ఆ తరువాత వివియన్ రిచర్డ్స్ పెళ్లి మరియంతో జరిగింది. ఆమెతో ఇద్దరు పిల్లలున్నారు.

6. క్రిస్‌గేల్ వెస్టిండీస్‌కు చెందిన అత్యంత విధ్వంసకర క్రికెటర్. పెళ్ళి కాకుండానే తండ్రయ్యాడు. 2017లో ఐపీఎల్ సందర్భంగా ఇతని గర్ల్‌ఫ్రెండ్ నతాషా బ్యారిజ్‌కు కూతురు పుట్టింది. క్రిస్‌గేల్‌కు అమ్మాయిలతో ఉండే సంబంధాలు ఇప్పటికే వివాదాస్పదంగా ఉన్నాయి.

Also read: Serena Williams Retirement: టెన్నిస్ సంచలనం సెరేనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News