CSK vs KKR Highlights: కోల్‌కత్తా దూకుడుకు చెన్నై బ్రేక్‌.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో గట్టెక్కిన సీఎస్కే

IPL 2024 CSK vs KKR Highlights: ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ వరుస విజయాలకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్రేక్‌ వేసింది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో చెన్నై సత్తా చాటి కోల్‌కత్తాకు ఓటమి రుచిచూపించింది. అతి స్వల్ప మ్యాచయినా కూడా ఆసక్తికరంగా సాగింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 8, 2024, 11:09 PM IST
CSK vs KKR Highlights: కోల్‌కత్తా దూకుడుకు చెన్నై బ్రేక్‌.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో గట్టెక్కిన సీఎస్కే

CSK vs KKR Highlights: ఈ సీజన్‌లో వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ భారీ షాక్‌ ఇచ్చింది. సొంత మైదానం చిదంబరం స్టేడియంలో ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో సత్తాచాటిన చెన్నై మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 7 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై విజయం సాధించింది. 14 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను చేజిక్కించుకోవడం విశేషం. ఈ విజయంతో చెన్నై హ్యాట్రిక్‌ ఓటమిని త్రుటిలో తప్పించుకోగా.. హ్యాట్రిక్‌ విజయాలతో దూకుడుగా ఉన్న కేకేఆర్‌ ఈ సీజన్‌లో తొలి పరాభయం ఎదుర్కొంది.

Also Read: GT vs PBKS Highlights: శుభ్‌మన్‌ గిల్‌ కుమ్మినా గుజరాత్‌కు తప్పని ఓటమి.. శశాంక్‌ మాయతో పంజాబ్‌ విజయం

 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్‌ నైట్‌ రైడర్స్‌ తడబడింది. గత మూడు మ్యాచ్‌ల్లో సత్తా చాటిన బ్యాటర్లు ఇక్కడ విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే సాధించింది. ఫిల్‌ సాల్ట్‌ తొలి బంతుకే మైదానం వీడాడు. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌తో రఫ్పాడిస్తున్న సునీల్‌ నరైన్‌ (27), అంగ్‌క్రిష్‌ రఘువంశీ (24) సాధారణ పరుగులకే పరిమితమయ్యారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సాధించిన 34 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. వెంకటేశ్‌ అయ్యర్‌ మళ్లీ ఫామ్‌లేడని నిరూపించింది. మూడు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. రమదీప్‌ సింగ్‌ (13), రింకూ సింగ్‌ (9), ఆండ్రె రసెల్‌ (10), అనుకూల్‌ రాయ్‌ (3), మిచెల్‌ స్టార్క్‌ (0) స్కోర్‌ సాధించడంలో తడబడ్డారు. అత్యల్ప స్కోర్‌ను చెన్నైకి లక్ష్యంగా విసిరారు. చెన్నై బౌలర్లు రెచ్చిపోయారు. కేకేఆర్‌ను తొలి బంతి నుంచే ఆధిపత్యం చెలాయిస్తూ 9 వికెట్లు పడగొట్టారు. తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి బంతితో రెచ్చిపోయారు.  ముస్తాఫిజర్‌ రహమాన్‌ రెండు, మహీష్‌ తీక్షణ ఒక వికెట్‌ తీశాడు.

Also Read: DC Vs KKR Live Score: ఐపీఎల్‌లోనే రెండో అత్యధిక స్కోర్‌.. సునీల్‌ నరైన్‌ ఊచకోతతో కేకేఆర్‌ హ్యాట్రిక్‌ విజయం

అతి స్వల్ప లక్ష్యాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సునాయాసంగా ఛేదించింది. తక్కువ స్కోర్‌ను  విజయం సాధించింది. రచిన్‌ రవీంద్ర (15) అతి తక్కువ స్కోర్‌కే పరిమితమవగా.. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. .. బంతుల్లో .. చేసి సత్తా చాటాడు. డేరిల్‌ మిచెల్‌ (25), శివమ్‌ దూబే (28) పరుగులు చేసి జట్టును విజయతీరాల వైపు నడిపించారు. ఆఖరులో వచ్చిన సీనియర్‌ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోని తనదైన బ్యాటింగ్‌తో ఫినిషింగ్‌ ఇవ్వడంతో చెన్నై విజయం సాధించింది. బ్యాటింగ్‌లో విఫలమైన కోల్‌కత్తా బౌలింగ్‌లో కూడా తడబడింది. చేసిన స్వల్ప స్కోర్‌ను కాపాడుకోవడంలో బౌలర్లు విఫలమయ్యారు. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై వికెట్లు తీసేందుకు శ్రమించారు. వైభవ్‌ అరోరా రెండు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్‌ ఒక వికెట్‌ తీశాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News