Yamaha offer on two wheelers: యమహా వాహనాలపై ప్రత్యేక ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, స్క్రాచ్‌ అండ్‌ విన్‌ ఆఫర్లు, 999 డౌన్‌పేమెంట్‌తో స్కూటర్‌‌ సొంతం

Yamaha announces festive season offers: యమహా రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన రే జెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐతో పాటు మరికొన్ని స్కూటర్లకు ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. మరి ఆ  స్కూటర్‌‌ మోడల్స్ ఏంటి? యమహా పెట్టిన ఆఫర్లు ఏమిటో ఒకసారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2021, 08:14 PM IST
  • యమహా వాహనాలపై ప్రత్యేక ఆఫర్లు
  • రూ.999 డౌన్‌పేమెంట్‌తో స్కూటర్‌ను తీసుకునే అవకాశం
  • క్యాష్‌బ్యాక్, స్క్రాచ్‌ అండ్‌ విన్‌ ఆఫర్లు‌
Yamaha offer on two wheelers: యమహా వాహనాలపై ప్రత్యేక ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, స్క్రాచ్‌ అండ్‌ విన్‌ ఆఫర్లు, 999 డౌన్‌పేమెంట్‌తో స్కూటర్‌‌ సొంతం

Yamaha announces festive season offers: యమహా  (yamaha) కంపెనీ పండగ సీజన్‌ నేపథ్యంలో వాహనాలపై ఆఫర్స్ పెట్టింది. యమహా రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన రే జెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐతో పాటు మరికొన్ని స్కూటర్లకు ( scooters) ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. మరి ఆ  స్కూటర్‌‌ మోడల్స్ ఏంటి? యమహా పెట్టిన ఆఫర్లు ఏమిటో ఒకసారి చూద్దాం.

ఫాసినో 125 ఎఫ్‌ఐ ఈ మోడల్‌పై రూ.3,876 వరకు బీమా ప్రయోజనాలు కల్పిస్తోంది. అయితే ఇందుకు బదులుగా కస్టమర్స్‌ (customers) రూ.999 డౌన్‌పేమెంట్‌తో స్కూటర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఉంటుంది. '

రూ.1,00,000 వరకు పొందే అవకాశం

అలాగే స్క్రాచ్‌ కార్డ్‌ అండ్‌ విన్‌ పోటీలో కనీసం రూ.2,999 బహుమతిగా గెలుచుకునే అవకాశాన్ని కూడా యమహా కల్పిస్తోంది. ఇక ఈ కాంటెస్ట్‌లో గరిష్ఠంగా బంపర్‌ ప్రైజ్‌ కింద రూ.1,00,000 వరకు పొందే అవకాశం ఉంది. యమహా రే జెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ రెండు వేరియంట్లలో లభిస్తోంది. హైబ్రిడ్‌, నాన్‌-హైబ్రిడ్‌ అనే వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. అయితే నాన్‌-హైబ్రిడ్‌ వేరియంట్‌పై ఫాసినో 125 ఎఫ్‌ఐకి వర్తించే అన్ని ఆఫర్లు వర్తిస్తాయి.

Also Read : Vaccine Effect On Menstrual Cycle: వ్యాక్సినేషన్ తరువాత మహిళల్లో కొత్త సైడ్ ఎఫెక్ట్

రూ.999 డౌన్‌పేమెంట్‌తోనే స్కూటర్‌

ఇక ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ స్కూటర్‌‌ను కొనుగోలు చేసేవారికి రూ.5,000 క్యాష్‌బ్యాక్‌ (cash back) ఆఫర్ పెట్టింది యమహా. రూ.999 డౌన్‌పేమెంట్‌తోనే ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. అలాగే రూ.6,000 వరకు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఇచ్చింది కంపెనీ. స్క్రాచ్‌ అండ్‌ విన్‌ కింద రూ.2,999 నుంచి రూ.1,00,000 వరకు క్యాష్ పొందే అవకాశం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. యమహా స్కూటర్‌‌ (Scooters) కొనాలనుకుంటే షోరూమ్‌కి వెళ్లి బెస్ట్ ఆఫర్‌‌లో కొనేయండి.

Viral Video: ఖబర్దార్ హస్బెండ్స్.. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇదే జరుగుతుంది! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News