Ovarian Cancer: ఒవేరియన్ కేన్సర్ గురించి ప్రచారంలో ఉన్న 6 అబద్ధాలు, వాస్తవాలు

Ovarian Cancer: ఆధునిక వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మనిషిని ఇంకా భయపెడుతున్న వెంటాడుతున్న వ్యాధి కేన్సర్. కేన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. ఇవాళ అంటే మే 8న వరల్డ్ ఒవేరియన్ కేన్సర్ డేగా పరిగణిస్తారు. ఒవేరియన్ కేన్సర్ అంటే ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2024, 06:22 PM IST
Ovarian Cancer: ఒవేరియన్ కేన్సర్ గురించి ప్రచారంలో ఉన్న 6 అబద్ధాలు, వాస్తవాలు

Ovarian Cancer: ఒవేరియన్ కేన్సర్ అనేది మహిళలకు సంభవించే అత్యంత ప్రమాదకరకమైన వ్యాధి. వరల్డ్ ఒవేరియన్ కేన్సర్ డే సందర్భంగా మహిళల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ఎందుకంటే ఈ వ్యాధి గురించి చాలా రకాల అవాస్తవాలు, పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఏది నిజం, ఏది కాదనేది తెలుసుకోవాలి. ఒవేరియన్ కేన్సర్‌కు సంబంధించి ప్రచారంలో ఉన్నవాటిలో ఆరు నిజాలు, ఆరు అవాస్తవాలేంటో చూద్దాం.

ప్రచారంలో: ఒవేరియన్ సిస్ట్ , ఒవేరియన్ కేన్సర్ రెండూ ఒకటే అని ఉంది. 
వాస్తవం: ఒవేరియన్‌లో సిస్ట్ అనేది సాధారణం. ఎక్కువగా ఇది కేన్సరస్ కాదు. ఒకవేళ సిస్ట్ పరిమాణం పెరుగుతూ ఇతర లక్షణాలు కన్పిస్తే మాత్రం అప్రమత్తం అవాలి. 

ప్రచారంలో: కేవలం జీన్స్ పరంగా అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉంటేనే కేన్సర్ ముప్పు ఉంటుంది.
వాస్తవం.: అయితే కుటుంబ చరిత్రలో కేన్సర్ ఉంటే ముప్పు పెరుగుతుంది. కానీ కుటుంబ చరిత్ర లేని మహిళలకు ఈ వ్యాధి సంక్రమించదనేది అబద్ధం.

ప్రచారంలో: ఒవేరియన్ కేన్సర్ అనేది ప్రాణాంతకమైంది
వాస్తవం: ఒవేరియన్ కేన్సర్ ప్రారంభంలో గుర్తించగలిగితే  చికిత్స ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తుండాలి. లక్షణాలు కన్పిస్తే మాత్రం అలర్ట్ అవాలి.

ప్రచారంలో: ఒవేరియన్ కేన్సర్ అనేది కేవలం వయస్సులో పెద్దవాళ్లయిన మహిళలకే వస్తుంది
వాస్తవం: అయితే ఒవేరియన్ కేన్సర్ ఎక్కువగా మెనోపాజ్ దాటిన మహిళల్లో కన్పిస్తుంది. కానీ ఏ వయస్సువారికైనా ఈ వ్యాధి రావచ్చు. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా అందగరూ ఈ వ్యాధి లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలి

ప్రచారంలో: ఒవేరియన్ కేన్సర్‌కు లక్షణాలు కన్పించవు
వాస్తవం: ఒవేరియన్ కేన్సర్ ప్రారంభంలో లక్షణాలు కన్పించవు. కానీ వ్యాధి పెరిగే కొద్దీ మహిళల్లో కడుపు నొప్పి, బ్లోటింగ్, తరచూ మూత్రం రావడం, అసామాన్యంగా వెజైనల్ డిశ్చార్జ్, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కన్పిస్తుంటాయి. ఈ లక్షణాలు మీలో కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి

ప్రచారంలో: ప్యాప్ స్మీయర్ టెస్ట్ ద్వారా ఒవేరియన్ కేన్సర్ గుర్తించవ్చు
వాస్తవం: ప్యాప్ స్మీయర్ పరీక్ష సర్వైకల్ కేన్సర్ గుర్తించేందుకు చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా ఒవేరియన్ కేన్సర్ ఉందో లేదో తెలియదు. ఒవేరియన్ కేన్సర్ గుర్తించేందుకు ఏ స్క్రీనింగ్ టెస్ట్ లేదు. కానీ వైద్యుని సంప్రదించి కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు.

Also read: Brain Health Tips: రోజూ ఈ డ్రింక్స్ తాగితే చాలు మీ మెదడు కంప్యూటర్‌లా పనిచేస్తుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News