Ketika Sharma: తొలిసారి అలా కనిపించి ఆశ్చర్యపరిచిన కేతిక శర్మ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..


Ketika Sharma:  కేతిక శర్మ  గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో  అడుగుపెట్టి ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తోన్న  ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు. అందుకే గ్లామర్ షోను నమ్ముకుంది. తాజాగా గ్లామర్ కాకుండా నార్మల్‌గా కనిపించి ఆశ్యర్యపరిచింది.

1 /6

కేతిక శర్మ.. కొంత మంది  హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు మొదటి సినిమాతోనే దక్కించుకుంటారు. అలాంటి వాళ్లలో కేతిక శర్మ ఒకరు.

2 /6

కేతిక శర్మ ముందు యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆపై గాయనిగా.. అటు తన డబ్ స్మాష్‌లతో వీడియోలతో బాగా పాపులర్ అయింది. అలా ఒక్కో చాన్సుతో సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. 

3 /6

పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్‌' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది కేతిక. మొదటి  సినిమాలోనే అందాల ఆరబోతతో సెగలు పుట్టించి హీట్ పుట్టించింది.

4 /6

రొమాంటిక్ మూవీలో ఈమె అందాల జాతరకు ప్రేక్షకులు సహా సినీ ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. దీంతో కేతికకు వరుస ఛాన్సులు వచ్చి పడుతున్నాయి. కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.

5 /6

లాస్ట్ ఇయర్  పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించినా.. ఈ భామకు పెద్దగా కలిసొచ్చిందేమి లేదు. పెద్ద హీరో సినిమాలో నటించానన్న సంతృప్తి తప్పితే.. ఈ సినిమాలో కేతిక క్యారెక్టర్ కూరలో కరివేపాకు టైపు అయిపోయింది.

6 /6

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో తన లక్‌ను పరీక్షించుకుంది.