Bellam Paanakam Benefits: ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. బెల్లం పానకం డైలీ తాగడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?

Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

1 /6

శ్రీరామ నవమి వేడుకలను ప్రజలంతా ఎంతో ఉల్లాసంగా, వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని అందంగా పూలతో అలకంరిస్తారు. అదే విధంగా రాముడికి బెల్లం పానకం, వడపప్పులు నైవేద్యంగా సమర్పిస్తారు. రాముడికి, సీతమ్మకు బెల్లం పానకం అంటే ఎంతో ప్రీతికరమని పండితులు చెబుతుంటారు.

2 /6

బెల్లం పానకం సమ్మర్ లో ఎక్కువగా ప్రతిరోజు ఒక గ్లాసు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండకాలంలో శరీరంలో వేడి సంబంధమైన సమస్యలు వస్తుంటాయి. కొందరికి మూత్ర సంబంధిత ఇబ్బందులు కల్గుతుంటాయి.

3 /6

ఇలాంటి వారు బెల్లం పానకం తాగితే, వెంటనే ఉపశమనం లభిస్తుంది. బెల్లంను మెత్తగా తురుముకుని, నీళ్లలో వేసుకొవాలి. ఆతర్వాత యాలకులు, శోంఠి, మిరియాలను పౌడర్ లాగా చేసుకొవాలి. ఈ పౌడర్ ను బెల్లం నీళ్లలో వేసి ఒక ఐదు నిముషాలు బాగా  కలపాలి. 

4 /6

ఇలా చేసిన బెల్లం పానకం తాగడంవల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు ఉంటే తగ్గిపొతాయి. అదే విధంగా అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఇది మంచి ఉపశమనంగా చెప్పుకొవచ్చు. అనవసర కొవ్వు ఇట్టే కరిగిపోయేలా చేస్తుంది. శరీరంను చల్లగా ఉంచుతుంది.

5 /6

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కొందరు అధిక ఒత్తిడితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు  బెల్లం పానకం డైలీ తాగాలి.

6 /6

చక్కెరకు బదులుగా బెల్లం పానకం తాగితే మనకు అధిక ప్రయోజనముందని చెబుతుంటారు. బెల్లం వల్ల పీరియడ్స్ సమయంలో మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే బ్లీడింగ్ సమస్యనుంచి ఉపశమనం లభిస్తుంది.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)