Vaishakha Amavasya 2024: వైశాఖ అమావాస్య.. శనీశ్వరుడిని రేపు ఇలా పూజిస్తే మీ జీవితంలో మహార్దశ ఆరంభం..

Vaishakha Amavasya 2024: అమావాస్యను చాలా మంది మంచి తిథి కాదని భావిస్తారు. కానీ ప్రతి తిథికి వెనుకాల ఏదోఒక రహాస్యం తప్పకుండా దాగిఉంటుంది. దీపావళి రోజున చెడుపై మంచి గెలిచిన దానికి చిహ్నాంగా దీపావళి పండుగను జరుపుకుంటాం.
 

1 /6

హిందు ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క తిథివెనకాల ఏదో ఒక మర్మం ఉంటుంది. కొందరు అమావాస్యలను మంచిది కాదని భావిస్తారు. కానీ అమావాస్యరోజున చేసే పూజలు, పితృ కార్యాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. అందుకే అమావాస్యరోజున చనిపోయిన వారి పేర్ల మీద దానధర్మాలు, శ్రాధ్దాకర్మలుచేయాలని చెబుతుంటారు.

2 /6

మనలోచాలా మంది ఏలీనాటి శని, సాడేసాతీ, అర్ధష్టమ శని ప్రభావం వల్ల బాధపడుతుంటారు. ఇలాంటి వారు అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలోఉన్నత స్థానానికి చేరుకుంటారని చెబుతుంటారు. శనిదేవుడు ముఖ్యంగా మనం చేసుకున్న కర్మలను బట్టి పనిష్మెంట్ ఇస్తుంటారు.

3 /6

చాలా మంది సరైన వయస్సులో పెళ్లికాక ఇబ్బందులు పడుతుంటారు. ఉద్యోగంలో సరైన పురోగతి ఉండదు. జాబ్ చేసిన కూడా అంతగా నచ్చదు. పెళ్లైన కూడా పిల్లలు ఉండరు. ఇక.. మరోవైపు పితృశాపం వల్ల జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటు ఉంటారు.

4 /6

ముఖ్యంగా ఏలీనాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి ప్రభావంతో బాధపడుతున్న వారు.. అమావాస్యరోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించాలి. నల్లనువ్వులు, బ్లాక్ కలర్ బట్ట శనిదేవుడికి సమర్పించాలి. అంతేకాకుండా.. శనిదేవుడి అనుగ్రహాకం కోసం కాకులు, కుక్కలు,నల్లచీమలకు ఆహారం వేయాలి.

5 /6

ముఖ్యంగా కుక్కలకు చపాతీలు ఆహారంగా వేయాలి. అశ్వత్థ చెట్టు కింద చీమలకు చక్కెరను వేయాలి. పేదలకు అన్నదానం చేయాలి. వైశాఖ మాసంలో ఎండలు భగ్గుమంటుంటాయి. అందుకే మంచినీళ్ల వసతి ఏర్పాటు చేయాలి. రోడ్డుపై ఉండే వారికి కాళ్లు కాలకుండా చెప్పులు దానంగా ఇవ్వాలి. ఇలాంటి పనులు చేస్తే శనిచెడు ప్రభావం తగ్గుతుందని చెబుతుంటారు.

6 /6

శనిదేవుడు మనం చేసుకునే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తుంటాడంటారు. ఆయన తలుచుకుంటే, ఓడలు బళ్లైతాయి.. బళ్లు ఓడలౌతాయి.. అందుకే మంచి కర్మలు చేసుకుంటూ, ఎవరికి చెడు తలపెట్టకుండా ఉంటే శనీశ్వరుడి మనకు చెడు ఫలితాలు కాకుండా మంచి ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)