RCB vs KKR Highlights: ఆర్సీబీ ఏడో ఓటమి.. ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం..

IPL 2024: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కేకేఆర్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ లో కరణ శర్మ మూడు సిక్సర్ల కొట్టి గెలిపించేంత ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 21, 2024, 07:51 PM IST
RCB vs KKR Highlights: ఆర్సీబీ ఏడో ఓటమి.. ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం..

RCB vs KKR Match Highlights: ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (KKR), రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీకి అదృష్టం కలిసిరాలేదు. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. 

సాల్ట్ పిచ్చకొట్టుడు..
తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ బ్యాటర్లు హౌం గ్రౌండ్ లో రెచ్చిపోయారు. ఓపెనర్ సాల్ట్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపాడు. ఈ క్రమంలో వేగవంతమైన హాఫ్ సెంచరీ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 56 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం పది పరుగులే చేసి ఔటయ్యాడు. 

అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. 
నరైన్‌ తర్వాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ(3), వెంకటేశ్‌ అయ్యర్‌ (16) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు జతకలిసిన రింకూ సింగ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. 16 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్ తో 24 పరుగుల చేసిన రింకూ ఫెర్గూసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం అయ్యర్ హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  చివర్లో రస్సెల్(27), రమణ్ దీప్(24) కూడా బ్యాట్ ఝలిపించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. 

జాక్స్, పటిదార్ మెరుపులు..
అనంతరం 223 భారీ లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ నిరాశపరిచారు. కోహ్లీ(18), డుప్లెసిస్ (7) పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాక్స్, రజిత్ పటిదార్ కేకేఆర్ బౌలర్ల పై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జాక్స్ 32  బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 55, పటిదార్ 23 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 52 పరుగులు చేసి ఇద్దరు ఒకే ఓవర్ లో ఔటయ్యారు. వీరిద్దరిని రస్సెల్ పెవిలియన్ కు పంపాడు. కాసేపటికే గ్రీన్(6), లోమోర్(4)ను ఒకే ఓవర్ లో ఔట్ చేశాడు నరైన్. 

Also Read: KKR vs RCB: హైట్ ను ఉపయోగించుకుని స్టన్నింగ్ క్యాచ్ పట్టిన గ్రీన్, ట్రెండింగ్ లో వీడియో

భయపెట్టిన కరణ్ శర్మ..
దీంతో 155 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆర్సీబీని ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్ ఆదుకున్నారు. ఈ క్రమంలో 18 బంతుల్లో 24 పరుగులు చేసిన ప్రభు హార్షిత్ రానాకు చిక్కాడు. అనంతరం సిక్స్ కొట్టి మాంచి ఊపుమీదున్న కార్తీక్ 18 బంతుల్లో 25 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరణ్ శర్మ చివరి ఓవర్ లో మూడు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు, కానీ అనుహ్యంగా ఔట్ అయ్యాడు. దీంతో కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. 

Also Read: IPL Jio Data Plans: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు డేటా సరిపోవడం లేదా, టాప్ 5 జియో డేటా ప్లాన్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News