TSRTC Special Services: ఆవకాయ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. ఇక మీదట స్పెషల్ సర్వీసులు..

TSRTC Special Busses: మనలో ప్రతి చాలా మంది సమ్మర్ రాగానే ఆవకాయలను కొనుగోలు చేసుకుంటారు. చప్పటి ఆవకాయ, ఆవకాయపచ్చడి, మాగాయి వేసుకుంటారు. అదే విధంగా బంధువలు మన ఇంటికి వచ్చినప్పుడు పార్శీల్ గా కూడా కట్టి ఇస్తుంటారు.

1 /6

సమ్మర్ సీజన్ లో మామిడిపండ్లు ఎక్కువగా మార్కెట్ లోకి వస్తాయి. కొన్నిమామిడి పండ్లు రసాలకు చెందినవి ఉంటాయి. మరికొన్ని తియ్యటి,చప్పటి మామిడిపండ్లు ఉంటాయి. కాయగా ఉండే మామిడి పండ్లతో చాలా మంది ఆవకాయలు పెట్టుకుంటారు.

2 /6

ఏడాదికి అవసరమైన ఆవకాయలను ఒకేసారి వేసుకుంటారు. వీటిలో పచ్చడి, చప్పటి ఆవకాయ, కారం ఆవకాయ, మాగాయి వంటి అనేక విధాలుగా ఉంటుంది. దీనిలో ఉప్పు ఎక్కువగా వేయడం వల్ల ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువమంది ఎండకాలంలో చేసుకుంటారు.

3 /6

అందరికి మామిడి కాయలతో ఆవకాయచేసుకొవడం అస్సలు రాదు. దీంతో చాలా మంది ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారు ఆవకాయ వేసుకుంటారు. ఇలాంటి వారు.. తమ బంధువులకు, స్నేహితులకు ఆవకాయలను పార్శీల్ లను పంపిస్తారు. మామిడిని సాంబార్, కర్రీలలో కూడా వేసుకుంటారు.

4 /6

మామిడి కాయలతో ఆవకాయ వేయడంను కొందరు బిజినెస్ గా చేసుకుంటారు. ఇలాంటి క్రమంలో.. దూర ప్రాంతంలో ఉన్న వారు ఎలా చేరవేయాలో కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈక్రమంలోనే ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ మంచి సదుపాయం కల్పించారు.

5 /6

రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు #TSRTC ద్వారా సులువుగా పంపించుకునే సౌకర్యం కల్పించారు. మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని  బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంది.   

6 /6

తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తోంది.  పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్  ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించవచ్చని ఆర్టీసీ అధికారులు ఒకప్రకటనలో వెల్లడించారు.